Sheikh Hasina | గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనా (Sheikh Hasina)కు సూచించింది. ఆ సమయంలో హసీనా తనను కాల్చి చంపేయండి అంటూ ఆర్మీతో అన్నట్లు తాజాగా వెల్లడైంది. ‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ (Shoot bury me here) అంటూ ఆర్మీతో అన్నట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (International Crimes Tribunal)లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం (Mohammad Tajul Islam) ఈ విషయాన్ని వెల్లడించారు.
గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 8న ఆయన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Golden Dome | ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ.. డొనాల్డ్ ట్రంప్ ఆఫర్
Donald Trump | డొనాల్డ్ ట్రంప్‌కు హార్వర్డ్‌పై కక్ష అందుకేనట.. ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం
SpaceX Starship: స్పేస్ఎక్స్ ప్రయోగం మళ్లీ విఫలం.. అదుపు తప్పి కూలిన స్టార్‌షిప్