టెక్సాస్: బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ రాకెట్ విఫలమైంది. మంగళవారం జరిగిన తొమ్మిదవ స్టార్‌షిప్ ప్రయోగం వికటించింది. బూస్టర్ పేలడంతో.. రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అనుకున్న రీతిలో ప్రయోగం పూర్తి కాలేదు. పేలుడు వల్ల రాకెట్లో ఇంధనం లీకైంది. ఆ సమయంలో రాకెట్ గింగిరాలు తిరిగింది. దీంతో అది అదుపు తప్పింది. రాకెట్‌కు చెందిన వెహికిల్ భూ వాతావరణంలోకి తిరిగి వస్తున్ నసమయంలో.. తమ బృందం ఆ వెహికిల్తో ఆల్టిట్యూడ్ కంట్రోల్ చేయలేకపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది.
మార్చి నెలలో జరిగిన 8వ స్టార్‌షిప్ ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. టెక్సాస్ నుంచి గాలిలోకి ఎగిరిన తర్వాత కాసేపటికే అది పేలింది. దాంతో అప్పుడు అనేక అమెరికా విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. అంతరిక్ష వ్యర్థాల పట్ల వార్నింగ్ కూడా ఇచ్చారు. గత ప్రయోగంతో పోలిస్తే ఈ సారి రెండు దశలు అధికంగానే రాకెట్ దూసుకెళ్లింది. గల్ ఆఫ్ టెక్సాస్ సమీపంలో ఉన్న బ్రౌన్స్‌విల్లే నుంచి ప్రయోగం జరిగింది. మంగళవారం రాత్రి 7.36 నిమిషాలకు ప్రయోగాన్ని చేపట్టారు. స్టార్‌షిప్ వెస్సల్‌ను సూపర్ హెవీ రాకెట్ బూస్టర్ ద్వారా నింగిలోకి పంపారు.