Akash Bobba : ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) డోజ్ (DOGE – Department of Government Efficiency) ను ఏర్పాటు చేశారు. ట్రంప్ కార్యవర్గంలోని ఈ డోజ్‌కు టెస్లా చీఫ్ (Tesla chief) ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యం వహిస్తున్నారు. మస్క్ సారథ్యం వహిస్తున్న డోజ్‌లో తెలుగు సంతతి వాడైన యువ ఇంజినీర్ ఆకాష్ బొబ్బా (Akash Bobba) కు చోటు దక్కింది.
ఆకాశ్‌తో సహా ఆరుగురు యువకులను డోజ్‌లో రిక్రూట్ చేసుకున్నారు. వీరంతా 19 నుంచి 24 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలో వీరిని నియమించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యవస్థలో 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల యువ నిపుణుల బృందాన్ని నియమించడం, వారిలో కొందరు ఇంకా కాలేజీ విద్య పూర్తికాని వారు ఉండటం గమనార్హం. సున్నితమైన ప్రభుత్వ డేటాను వారికి యాక్సెస్ ఇవ్వడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఆకాష్ బొబ్బా విషయానికి వస్తే.. ఆయన నిర్వహణ, వ్యవస్థాపకత, సాంకేతిక కార్యక్రమంలో భాగంగా బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు హాజరయ్యాడు. డోజ్‌లో చేరడానికి ముందు ఈ 22 ఏళ్ల యువ ఇంజినీర్ మెటా, పలాంటిర్, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఏఐ, డేటా ఎనాలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో ఇతనికి పనిచేసిన అనుభవం ఉంది. ఆకాష్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM) లో ‘నిపుణుడు’గా అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో పేర్కొన్నారు. మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థలో కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ అమండా స్కేల్స్‌కు ఆకాశ్ రిపోర్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి.. ఆకాశ్ సహచరుడు చారిస్ జాంగ్ ఎక్స్‌లో వెల్లడించారు. ఆకాశ్ ప్రతిభను, కోడింగ్ నైపుణ్యాలను తెలియజేస్తూ ఆ అద్భుతమైన సంఘటనను అతడు గుర్తుచేసుకున్నాడు. ‘ప్రాజెక్ట్ గడువుకు రెండు రోజుల ముందు అనుకోకుండా మొత్తం డేటా డిలీట్ అయ్యింది. కానీ ఆకాశ్ మా భుజం తట్టి ఒక్క రాత్రిలోనే దానిని మళ్లీ పూర్తి చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. అందరికంటే తామే ముందుగా ప్రాజెక్ట్ నివేదిక సమర్పించి మొదటి స్థానంలో నిలిచామని తెలిపాడు.
డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో పాటు డోజ్ సారథిగా భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని నియమించారు. కానీ ఆయన ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మర్నాడే వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. వాస్తవానికి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి వివేక్ కూడా పోటీపడ్డారు. కానీ ఆ తర్వాత ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు.
PM Modi | వికసిత్ భారత్ మా లక్ష్యం.. లోక్‌సభలో ప్రధాని ప్రసంగం
Maha Kumbh | మహా కుంభమేళాలో భూటాన్ రాజు.. యూపీ సీఎంతో కలిసి పుణ్య స్నానాలు
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం