ఆదివారం 31 మే 2020
International - Apr 30, 2020 , 12:25:18

ఐదు నెలల గర్భిణి హత్య.. భర్త ఆత్మహత్య

ఐదు నెలల గర్భిణి హత్య.. భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌ :  భారత సంతతికి చెందిన ఐదు నెలల గర్భిణి దారుణ హత్యకు గురికాగా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని హడ్సన్‌ దేశంలో ఏప్రిల్‌ 26న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గరిమా కొఠారి(35), మన్‌మోహన్‌ మాల్‌(37) దంపతులు. ప్రస్తుతం కొఠారి ఐదు నెలల గర్భిణి. ఆమెను హత్య చేసిన అనంతరం మాల్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హడ్సన్‌ నదిలో మాల్‌ మృతదేహం లభ్యమైంది. హత్య, ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ దంపతులిద్దరూ జెర్సీ సిటీలో నుక్కాడ్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. కొఠారి మంచి చెఫ్‌ అని, మాల్‌ కూడా స్నేహపూర్వకంగా ఉండేవాడని రెస్టారెంట్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లిన మాల్.. కొలంబియా యూనివర్సిటీలో తన మాస్టర్స్‌ను పూర్తి చేశారు. వీరిద్దరూ మంచి జంట అని రెస్టారెంట్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. 


logo