Hurricane Helene | ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా (Hurricane Helene) విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఫ్లోరిడా (Florida) రాష్ట్రంపై ఈ తుపాను అత్యధికంగా ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. దాదాపు పది కౌంటీల్లో ఈ తుపాను తీవ్రత ఉన్నట్లు వెల్లడించారు. తుపాను ధాటికి ఆయా రాష్ట్రాలను వరద (flooding) చుట్టుముట్టింది. అతి తీవ్రమైన హెలెనా కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
హెలెనా తుపాను కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. పలు ఆసుపత్రుల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ సాయంతో 54 మందిని రక్షించారు. అదేవిధంగా టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ తుపాను గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి గురువారం మధ్యాహ్నం అమెరికాలోకి ప్రవేశించింది. ఈ తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి. ఫ్లోరిడాలో తుపాను తీరం దాటేటప్పుడు గంటలకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Also Read..
Megastar Chiranjeevi | ఐఫా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
Mumbai | ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు.. పోలీసులు హై అలర్ట్
Urvashi Rautela | దానిని వేరే కోణంలో చూడొద్దు ప్లీజ్.. ఊర్వశీ రౌతేలా రిక్వెస్ట్