Megastar Chiranjeevi IIFA 2024 | ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా శనివారం అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా (Outstanding Achievement in Indian Cinema) అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. మరోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నాడు.
#MegastarChiranjeevi garu received the “Outstanding Achievement in Indian Cinema” Award at the IIFA event in Abu Dhabi.#Megastar #Chiranjeevi ✨ @KChiruTweets #IIFAUtsavam2024 pic.twitter.com/bdT9d5wwTY
— Ravi Teja (@RaviTejaChiru) September 28, 2024