Urvashi Rautela | డేటింగ్ యాప్లో సెలబ్రిటీల పేర్లు ప్రస్తుతం బీటౌన్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ పేర్లలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా పేరు కూడా ఉండటంతో.. ఈ వ్యవహారంపై ఊర్వశీ స్పందించింది. ‘కేవలం మేం మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్లో లాగిన్ అయ్యాం. ఇందులో నాతోపాటు హృతిక్, ఆదిత్యరాయ్.. ఇలా చాలామంది పేర్లున్నాయి. సమయం దొరికినప్పుడల్లా ఈ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. లీజర్ టైమ్లో ఒకరికొకరం రిక్వెస్టులు పెట్టుకుంటాం. దయచేసి దీన్ని వేరే కోణంలో చూడొద్దు. ప్లీజ్..’ అంటూ రిక్వెస్ట్ చేసింది ఊర్వశీ రౌతేలా.
ప్రస్తుతం ఈ అందాలభామ టాలీవుడ్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఊర్వశి కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా గురించి ఇటీవల మాట్లాడుతూ ‘బలమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. బాలయ్యసార్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా. టాలీవుడ్ వాతావరణం నాకెంతో నచ్చింది. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ఊర్వశీ రౌతేలా.