Vijay – Rashmika |విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలపై క్లారిటీ.. నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
Vijay - Rashmika | టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఇప్పటివరకు “మేము కేవలం మంచి స్నేహితులమే” అంటూ పబ్లిక్‌గా చెప్పుకొచ్చిన ఈ జంట నిజంగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
Vijay – Rashmika | టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఇప్పటివరకు “మేము కేవలం మంచి స్నేహితులమే” అంటూ పబ్లిక్‌గా చెప్పుకొచ్చిన ఈ జంట నిజంగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం, రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి వేడుక జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 తేదీని ముహూర్తంగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ వేడుకను గోప్యంగా ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా సోషల్ మీడియాలో సమాచారం లీక్ అవుతూనే ఉండటం గమనార్హం.
పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో సాదాసీదాగా జరిగినా, అసలు హంగామా మాత్రం హైదరాబాద్‌లోనే ఉండబోతుందని టాక్. మార్చి 4న నగరంలోని ప్రముఖ వేదికలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వాన పత్రిక అందించారనే ప్రచారం ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆ భేటీ తర్వాత సోషల్ మీడియాలో “పెళ్లి ఖాయం” అనే చర్చలు వేగం పుంజుకున్నాయి.
తాజాగా విజయ్ దేవరకొండ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఈ ఇన్విటేషన్ ప్రకారం వారి వివాహం ఫిబ్రవరి 26న వివాహవం జరగనుందని అర్ధమవుతుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ బట్టి రష్మికవ- విజయ్ దేవరకొండ వివాహం చాలా సీక్రెట్‌గా జరగనుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఈ రిసెప్షన్‌కు పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నిర్మాతలు, టాప్ డైరెక్టర్లు హాజరవుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనే టాక్ ఉంది. రష్మిక – విజయ్‌లతో కలిసి పని చేసిన దర్శకులు, టెక్నీషియన్లు, సన్నిహితులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

