Nobel Prize | 2025 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) గురువారం ప్రకటించింది. హంగేరియన్ రచయిత (Hungarian Author) క్రాస్జ్నా హోర్కై (Laszlo Krasznahorkai)ను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. లిటరేచర్‌లో గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నెబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ లిటరేచర్‌లో నోబెల్ ప్రకటించింది. ఇక శుక్రవారం ఇక శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
Also Read..
UK PM | భారత అభివృద్ధిపై యూకే ప్రధాని ప్రశంసలు.. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు కౌంటర్
మెటల్-ఆర్గానిక్‌పై పరిశోధనలకు రసాయన నోబెల్
Tejashwi Yadav | ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వి యాదవ్ కీలక హామీ