UK PM | ‘భారత్‌ది డెడ్ ఎకానమీ..’ (Indian economy is dead) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు యూకే ప్రధాని (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న యూకే ప్రధాని.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రశంసించారు. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరించిందని గుర్తు చేశారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు.
యూకే ప్రధాని భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘2028 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు గానూ ప్రధాని మోదీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం’ అంటూ యూకే ప్రధాని తెలిపారు.
Also Read..
Forbes List | ఫోర్బ్స్ కుబేరుల జాబితా.. మళ్లీ ముకేశ్ నంబర్-1