PM Modi | గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా (Gaza War)లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఒప్పందం యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా గాజాలో బందీల విడుదల, అక్కడి ప్రజలకు మానవతా సాయం కూడా పెరుగుతుంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని మేము ఆశిస్తున్నాము’ అని ప్రధాని మోదీ తన ఎక్స్ ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read..
Donald Trump | ‘శాంతి’ గురించి నాకు తెలియదు.. నేనైతే ఏడు యుద్ధాలు ఆపా : డొనాల్డ్ ట్రంప్