Nobel Peace Prize | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం తహతహలాడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తోంది. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House) ఆసక్తికర ట్వీట్ చేసింది. అధ్యక్షుడు ట్రంప్‌ను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా (Peace President) పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
THE PEACE PRESIDENT. pic.twitter.com/bq3nMvuiSd
— The White House (@WhiteHouse) October 9, 2025
కాగా, స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నెబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు విభాగాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.
Also Read..
ఇల్లినాయిస్ను ఆక్రమించుకోనున్న టెక్సాస్.. అమెరికాలో మరో అంతర్యుద్ధం?
కాలిఫోర్నియాలో సెలవు రోజుగా దీపావళి