బీజింగ్, అక్టోబర్ 8: చైనాకు చెందిన 82 ఏండ్ల జాంగ్ అనే బామ్మ సొంత వైద్యం చేసుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. చాలాకాలంగా తనను బాధపెడుతున్న నడుమునొప్పి.. బతికున్న కప్పలను మింగితే తగ్గిపోతుందని ఎవరో చెప్పిన సలహాను నమ్మి ఏకంగా 8 బతికున్న చిన్న కప్పలను నోట్లో వేసుకుని మింగేసింది. అలా మింగిన వెంటనే ఆమె నడుం నొప్పి మాయం మాట దేవుడెరుగు తీవ్రంగా కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో ఆమెను హాంగ్జౌలోని దవాఖానకు తరలించారు. వెంటనే ఆమెకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడినప్పటికీ బతికున్న కప్పలు ఆమె కడుపులోని జీర్ణవ్యవస్థను నాశనం చేశాయని డాక్టర్లు తెలిపారు.