Gaza Peace Deal | గాజాలో యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు.. శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్-హమాస్
Gaza Peace Deal | గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా (Gaza War)లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి.
Gaza Peace Deal | గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా (Gaza War)లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ప్రకటించారు.
హమాస్ చేతిలో బందీగా ఉన్నవారంతా త్వరలోనే విడుదల అవుతారని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన జరగడానికి యూఎస్‌తో పాటు కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కియేకి ట్రంప్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. గాజాలో యుద్ధం (Gaza Plan) ముగింపుకు డొనాల్డ్ ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఫార్ములాను భారత్ సహా పలు దేశాలు స్వాగతించాయి. ట్రంప్ ఫార్ములాకు ఇజ్రాయెల్, హమాస్ కూడా అంగీకారం తెలిపాయి. తాజాగా ఆ దిశగా తొలి అడుగు పడింది.
Also Read..
Donald Trump | ‘శాంతి’ గురించి నాకు తెలియదు.. నేనైతే ఏడు యుద్ధాలు ఆపా : డొనాల్డ్ ట్రంప్
ఇల్లినాయిస్ను ఆక్రమించుకోనున్న టెక్సాస్.. అమెరికాలో మరో అంతర్యుద్ధం?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

