Forbes List | రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో (Forbes List) అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో (Indias 100 Richest People) ముకేశ్ అంబానీ ఫస్ట్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 105 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ముకేశ్ సంపద 12 శాతం క్షీణించింది.
ఇక ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ (Gautam Adani) రెండో స్థానంలో ఉన్నారు. OP జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ (Savitri Jindal) 40 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో, టెలికం దిగ్గజం సునీల్ మిట్టల్ 34 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్ బిలియనీర్ శివ నాడార్ 33 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. 2025 ఫోర్బ్స్ జాబితాలో 100 మంది దేశీయ కుబేరుల సంపద విలువ 9 శాతం (100 బిలియన్ డాలర్లు) పడిపోయి 1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందుకు పలు కారణాలు ఉన్నట్లు ఫోర్బ్స్ నివేదించింది.
Also Read..
రెండుగా విడిపోయిన ట్రస్టీలు.. టాటా గ్రూప్‌లో ఆధిపత్య పోరు!
ఆకాశమే హద్దుగా పుత్తడి.. రికార్డుస్థాయికి చేరుకున్న పదిగ్రాముల పుత్తడి ధర
ICRA | గోల్డ్ లోన్ల జోరు.. 2026 నాటికి రూ.15లక్షల కోట్లకు మించి..!