TTD | తిరుమల, తిరుపతి దేవస్థానానికి హైదరాబాద్ భక్తుడు భారీ విరాళం
TTD | వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్ కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు భారీ విరాళానాన్ని అందజేశారు.
తిరుమల : వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామికి హైదరాబాద్ కు చెందిన ( Hyderabad devotees ) శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు భారీ విరాళానాన్ని( Donation ) అందజేశారు. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించి తన భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 68,156 మంది భక్తులు దర్శించుకోగా 28,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు కానుకల వల్ల హుండీకి రూ. 3.46 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

