Dabur Company: డాబర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాలపై బ్యాన్
Dabur Company: ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రముఖ డాబర్ కంపెనీకి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వస్తువులని చెప్పుకుని అమ్మడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యతిరేకించింది.
న్యూఢిల్లీ: ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రముఖ డాబర్ కంపెనీ(Dabur Company)కి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వస్తువులని చెప్పుకుని అమ్మడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యతిరేకించింది. ఉత్పత్తులపై అలాంటి లేబుల్స్ వేయడం చట్టానికి వ్యతిరేకం అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొన్నది. భారత ఆహార భద్రతసంస్థ తన ఆదేశాల గురించి సోషల్‌మీడియాలో సోమవారం ఓ పోస్టు చేసింది. డాబర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఆహార ఉత్పత్తల అమ్మకాలపై 100 శాతం లేబుల్స్‌తో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆ పోస్టులో తెలిపింది.
తేనె, యాపిల్ సిడర్, వెనిగర్, వర్జిన్ కోకనట్ ఆయిల్, సీసేమ్ ఆయిల్, ఆవు నెయ్యి, కోకనట్ వాటర్, కోకనట్ మిల్క్ లాంటి ఐటమ్స్‌పై డాబర్ కంపెనీ 100 శాతం లేబుల్స్ వేస్తోంది. ఇలా లేబుల్స్ అతికించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తప్పుపట్టింది. 100 శాతం నేచురల్, 100 శాతం శుద్ధమైనవని, 100 శాతం ప్యూరిటీ గ్యారెంటీ, 100 శాతం ఆర్గానిక్, 100 శాతం టెండర్ కోకనట్ వాటర్ అని రాయడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పోస్టులో తప్పుపట్టింది. ఇది చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఆ ప్రకటనలు ఉన్నాయని ఆహార భద్రత సంస్థ వెల్లడించింది. 100 శాతం క్లెయిమ్స్ అనేవి 2018 ఎఫ్ఎస్ఎస్ అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తన పోస్టులో పేర్కొన్నది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన నోటీసులపై చెకింగ్ చేస్తున్నామని డాబర్ ఇండియా కంపెనీ తన ప్రకటనలో చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

