Rahul Gandhi: పరువునష్టం కేసులో భీవండి కోర్టుకు రాహుల్ గాంధీ.. కొత్త సూరిటీగా సప్కల్ పేరు ప్రతిపాదన
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ ఇవాళ భీవండి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో కొత్త గ్యారెంటీ వ్యక్తిగా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ పేరును ప్రతిపాదించారు. రాహుల్ రాక సందర్భంగా ముంబైలో బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
థానే: ఆర్ఎస్ఎస్ నమోదు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ భీవండి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ కేసులో కొత్త గ్యారెంటీ వ్యక్తి వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంతే పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ సమయంలో రాహుల్ గాంధీ కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ హాజరు నుంచి మినహాయింపు కోరేందుకు రాహుల్ తరపున గ్యారెంటీగా పెట్టిన వ్యక్తి వెళ్లాల్సి ఉంది.
గతంలో మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చాకుర్కర్ను గ్యారెంటర్‌గా పెట్టారు. కానీ ఆయన ఇటీవల మరణించారు. దీంతో కొత్త సూరిటీగా మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ పేరును ప్రతిపాదించారు. హర్షవర్ధన్ వివరాలను ఇవాళ కోర్టుకు సమర్పించారు. భవిష్యత్తులో ఈ కేసు విచారణలో రాహుల్ తరపున సప్కల్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
భీవండి కోర్టుకు వెళ్తున్న మార్గంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిరసన తెలిపిన కాంగ్రెస కు వ్యతిరేకంగా రాహుల్ వైఖరిని ఖండిస్తూ ఇవాళ బీజేపీ మద్దతుదారులు ప్రదర్శన చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

