Savitri Jindal | భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా (Indias Richest woman) మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓనర్ సావిత్రి జిందాల్ (Savitri Jindal) నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను (Indias 100 Richest People) ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. అంతేకాదు, టాప్ 10 భారత బిలియనీర్లలో ఉన్న ఏకైక మహిళ ఆమే కావడం విశేషం.
ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ముకేశ్ అంబానీ 105 బిలియన్ డాలర్లతో ఫస్ట్ ప్లేస్‌ను సొంతం చేసుకోగా, 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ (Gautam Adani) రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సావిత్రి జిందాల్ (Savitri Jindal) 40 బిలియన్ డాలర్లతో మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆమె సంపద 3.5 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ కొనసాగుతున్నారు.
భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సావిత్రి జిందాల్.. ఓపీ జిందాల్ గ్రూపు ఓనర్‌గా ఉన్నారు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని ఆమె నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హర్యానాలో ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్నారు. స్టీల్, పవర్, సిమెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు వ్యాపారాలున్నాయి.
ఆ గ్రూపునకు సావిత్రి చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్ ఆ కంపెనీ స్థాపించారు. 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి తర్వాత వ్యాపారాన్ని నాలుగురు కుమారులకు విభజించారు. ముంబైలో ఉండే ఆమె కుమారుడు సజ్జన్ జిందాల్ .. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం చేస్తున్నాడు. ఎంజీ మోటారు ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలో 35 శాతం వాటా తీసుకున్నారు. ఢిల్లీలో నివసించే నవీన్ జిందాల్.. జిందాల్ స్టీల్, పవర్ చూసుకుంటున్నారు.
Also Read..
Forbes List | ఫోర్బ్స్ కుబేరుల జాబితా.. మళ్లీ ముకేశ్ నంబర్-1
రెండుగా విడిపోయిన ట్రస్టీలు.. టాటా గ్రూప్‌లో ఆధిపత్య పోరు!