Houthis | నౌకలపై దాడులు ఆపబోము.. యూఎస్, యూకే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు : హౌతీ రెబల్స్
Houthis | ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై హౌతీ రెబల్స్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులకు అమెరికా, బ్రిటన్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Houthis | ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. యెమెన్‌లో (Yemen) వారి అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. సుమారు 16 ప్రదేశాల్లో 60 టార్గెట్లను ధ్వంసం చేశాయి.
అయితే, ఈ దాడులపై హౌతీ రెబల్స్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులకు అమెరికా, బ్రిటన్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు ఆపబోమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైపు వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగిస్తామని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి ప్రకటించారు.
కాగా, ఎర్ర సముద్రం వద్ద హౌతి రెబల్స్(Houthi Rebels).. రవాణా నౌకలపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దళాలు.. యెమెన్‌లోని హౌతి స్థావరాలపై అటాక్ చేశాయి. సుమారు 16 ప్రదేశాల్లో 60 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా పేర్కొన్నది. హౌతీ రెబల్స్ వాడుతున్నట్లు ఆ క్షేత్రాలపై బాంబులతో అటాక్ చేసినట్లు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ చెప్పింది. కమాండ్, కంట్రోల్ నోడ్స్, మునిషన్ డిపోలు, లాంచింగ్ సిస్టమ్స్, ప్రొడక్షన్ ఫెసిలిటీలు, ఎయిర్ డిఫెన్స్ రేడార్ సిస్టమ్‌లను టార్గెట్ చేసినట్లు అమెరికా తన ప్రకటనలో తెలిపింది.
కాగా, గాజాలో యుద్ధం మొదలైన నాటి నుంచి హౌతీ రెబల్స్ ఇప్పటి వరకు 27 నౌకలపై దాడి చేశారు. దీంతో ఎర్రసముద్రం రూట్లో వచ్చే ఇంధన నౌకల రవాణాకు బ్రేక్ పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం పడుతోంది.
Also Read..
Houthi Rebels: 60 హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా అటాక్
Houthi Rebels | హౌతీ రెబల్స్‌పై అమెరికా, యూకే ప్రతీకార దాడులు..
Sam Altman | బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్.. ఫొటోలు వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- houthi rebels
- Red Sea
- UK
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

