Donald Trump | అగ్రరాజ్యం అమెరికాలో అధికార రిపబ్లికన్‌కు గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇటీవలే అక్కడ జరిగిన పలు ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రాట్లు గెలుపొందారు. ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లోనూ భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికైన విషయం తెలిసిందే. అంతేకాదు పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అప్రమత్తమయ్యారు.
అమెరికాలోని ఓహియో గవర్నర్‌గా పోటీ (Ohio Governor race) చేయనున్న భారతీయ మూలాలు ఉన్న నాయకుడు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)కి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన సమ్‌థింగ్ స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన వివేక్ రామస్వామి ఓహియో రాష్ట్ర గవర్నర్‌గా అద్భుతంగా పనిచేస్తారని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు వివేక్‌కు అండగా ఉండాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టారు. ‘నాకు వివేక్ బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతో పోటీ పడ్డారు. యువకుడైన వివేక్.. చాలా స్మార్ట్. మన దేశమంటే ఆయనకు చాలా ఇష్టం’ అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా, ఓహియో గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇక వివేక్ రామస్వామి గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌తో పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఓహియో గవర్నర్‌గా పోటీ చేసేందుకు రెఢీ అయ్యారు.
Also Read..
Mali | మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
Donald Trump | జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన ట్రంప్..
James Watson | ఫాదర్ ఆఫ్ డీఎన్ఏ జేమ్స్ డీ వాట్సాన్ కన్నుమూత..!