శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 12, 2020 , 18:50:35

టిక్‌టాక్‌ చేస్తుండగా కొవిడ్‌ అని తేలింది..!

టిక్‌టాక్‌ చేస్తుండగా కొవిడ్‌ అని తేలింది..!

ఓ యువతి సరదాగా టిక్‌టాక్‌ చేస్తోంది. స్టార్‌బక్స్‌ డ్రింక్‌ తాగుతూ షూట్‌లో పాల్గొంది. అయితే, ఒక్కసారిగా తనకు రుచి కోల్పయిన భావన కలిగింది. తనకు కచ్చితంగా కొవిడ్‌-19 అయి ఉంటుందంటూ యువతి భయపడిపోయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

మేరిన్‌ అనే యువతికి టిక్‌టాక్‌ అంటే పిచ్చి. ఈ క్రమంలో కారులో కూర్చుండి స్టార్‌బక్స్‌ డ్రింక్‌ తాగుతూ టిక్‌టాక్‌ చేస్తున్నది. మొదటి సిప్‌ తీసుకోగానే ఆమెకు రుచి తెలియలేదు. మళ్లీ రెండో సిప్‌ తీసుకుంది.. మళ్లీ అదే పరిస్థితి. దీంతో ఆదుర్దా పడిపోయింది. అనంతరం కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. కాగా, ఆమె టిక్‌టాక్‌ వీడియో చూసి చాలామంది కామెంట్‌ చేశారు.  వెంటనే టెస్ట్‌ చేయించుకో అంటూ సలహా ఇచ్చారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.