ఎవరెస్ట్‌ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎవరెస్ట్ శిఖరానికి 1953 లో సరిగ్గా ఇదే రోజున చేరుకుని ఇద్దరు యోధులు రికార్డు సృష్టించారు. వారే నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎవరెస్ట్ శిఖరానికి 1953 లో సరిగ్గా ఇదే రోజున చేరుకుని ఇద్దరు యోధులు రికార్డు సృష్టించారు. వారే నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ. ప్రపంచమంతా ఈ క్షణాన్ని చారిత్రక విజయంగా గుర్తుంచుకుంటుంది. వీరి ఈ ఘనతకు సరిగ్గా 68 సంవత్సరాలు. వీరు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి గుర్తుంగా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఏటా ఇదో రోజున జరుపుకుంటారు.
29,032 అడుగుల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం హిమాలయాల్లో ఎత్తైన శిఖరం. చాలా చల్లని వాతావరణం, ఎత్తుపైకి చేరడం, మంచు తుఫానుల కారణంగా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది ఈ శిఖరానికి చేరుకోలేకపోయారు. 1921 లో, బ్రిటన్ యాత్రలో భాగంగా ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహకుల బృందాన్ని పంపింది. భయంకరమైన మంచు తుఫాను కారణంగా సిబ్బంది మిషన్‌ను అసంపూర్తిగా వదిలి వెళ్లారు. ఈ సమూహంలో ఉన్న జార్జ్ లే మెల్రీ శిఖరానికి చేరుకోవడానికి కొంచెం తేలికైన మార్గాన్ని కనిపెట్టాడు.
మరుసటి సంవత్సరం మెలరీ ఎవరెస్ట్ శిఖరాన్ని జయించేందుకు బయళ్దేరాడు. ఈసారి 27 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత వాతావరణం అనుకూలించక తన ప్రయత్నం విరమించుకున్నాడు.కాగా, 1952 లో టెన్జింగ్ నార్గే 28,210 అడుగుల ఎత్తుకు చేరుకోవడం ద్వారా ఒక ఘనత సాధించాడు. మరుసటి సంవత్సరం కల్నల్ జాన్ హంట్ నేతృత్వంలోని బృందం వచ్చింది. ఈ బృందంలో టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ కూడా ఉన్నారు. ఈ బృందం 1953 ఏప్రిల్ లో ఎక్కడం ప్రారంభించింది. ఒక్కొక్కరుగా తిరుగుముఖం పట్టగా.. తుదకు మే 29 న ఎడ్మండ్ హిల్లరీ,టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ శిఖరం అంచుకు చేరుకుని చరిత్ర సృష్టించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2015: వేడి గాలుల కారణంగా భారతదేశంలో 2300 మందికి పైగా మృతి
2002: గుజరాత్ అహ్మదాబాద్‌లో 4 బాంబులు పేలి దాదాపు 39 మంది మరణం
1996: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన బెంజమిన్ నెతన్యాహు
1988: ప్రభుత్వాన్ని తొలగించి పార్లమెంటును రద్దు చేసిన పాకిస్తాన్ అధ్యక్షుడు జియా-ఉల్-హక్
1987 : భారత ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మరణం
1985: యూరోపియన్ ఫుట్‌బాల్ కప్ సందర్భంగా రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ, 39 మంది మరణం
1972: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మరణం
1917: అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ జననం
ఇవి కూడా చదవండి..
జూన్ 20 వరకు జపాన్‌లో ఎమర్జెన్సీ.. ఒలింపిక్స్‌కు ముందు సమస్యలు
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

