General Min Aung Hlaing : నేనే ఇక ప్రధానిని : 2023 లో ఎమర్జెన్సీ ముగింపు
General Min Aung Hlaing : మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు.

యాంగాన్ : మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ (General Min Aung Hlaing) చెప్పాడు. సంక్షోభం ఎత్తివేసే దిశగా ఆగ్నేయాసియా దేశాలతో సహకరిస్తానన్నాడు. ఆదివారం నాడు చేసిన టెలివిజన్ సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకి ప్రభుత్వంపై సైన్యం ఫిబ్రవరి 1 వ తేదీన అర్ధరాత్రి తిరుగుబాటు చేసింది. సూకీ సహా ఎందరో నాయకులను అదుపులోకి తీసుకొని నిర్బందంలో ఉంచారు. సైన్యంతో జరిగిన ఘర్షణలో దాదాపు వేయి మంది ప్రాణాలు విడిచారు. వందల సంఖ్యలో సూకీ మద్దతుదారులు గాయపడ్డారు. అప్పటినుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ దేశ పరిపాలనను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. దేశంలో విధించిన ఎమర్జెన్సీని 2023 లో ఎత్తివేయనున్నట్లు జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు. అనంతరమే దేశ పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. మయన్మార్ దేశానికి అప్పటివరకు తానే ప్రధానమంత్రిని అని సైనిక నాయకుడు జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్.. తనను తాను ప్రకటించుకున్నాడు.
ప్రస్తుత సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కోసం ముందుకు వచ్చే ఆగ్నేయాసియా దేశాలతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఏసియాన్) పంపిన ప్రత్యేక రాయబారితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హేలింగ్ చెప్పాడు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల కోసం మేం తప్పనిసరిగా వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నదని చెప్పాడు. దేశంలో బహుళ పార్టీ ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇస్తున్నానని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ తిరుగుబాటు అనంతరం ఆంగ్ సాన్ సూకీపై సైనిక పాలన అనేక ఆరోపణలు చేసింది. వాకీ-టాకీ రేడియోను చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నందుకు, కరోనా వైరస్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు ఆమెపై కోర్టు విచారణ జరుగనున్నది. అనేక కేసుల్లో ఇరికించడం ద్వారా రాజకీయాల నుంచి సూకీని దూరంగా ఉంచాలని సైన్యం భావిస్తుందని మయన్మార్ ప్రజలు నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి..
63 శాతం పడిపోయిన భారతీ ఎయిర్టెల్ లాభం
అన్ని సమయాల్లో మీతోనే.. శిల్పాకు చెల్లె షమిత బాసట
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

