e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Raj Kundra Case : అన్ని సమయాల్లో మీతోనే.. శిల్పాకు చెల్లె షమిత బాసట

Raj Kundra Case : అన్ని సమయాల్లో మీతోనే.. శిల్పాకు చెల్లె షమిత బాసట

ముంబై : నీలి చిత్రాలు చిత్రీకరించారని రాజ్ కుంద్రాపై అభియోగాలు మోపిన కేసులో (Raj Kundra Case) శిల్పా శెట్టిని పోలీసులు విచారించారు. ఈ సమయంలో తనపై మీడియాలో వచ్చిన వార్తలపై శిల్పా శెట్టి నొచ్చుకున్నారు. ఈ కేసులో మీడియా తన విచారణను నిలిపివేయాలని శిల్పా శెట్టి ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని అనంతరం పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా ఆమె సోదరి షమితా శెట్టి అక్కకు మరోసారి బాసటా నిలిచింది. మంచి, చెడు సమయంలో సదా నీతోనే ఉంటానని షమితా శెట్టి అక్కకు మద్దతు తెలిపింది.

పోర్న్‌ సినిమా కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి స్టేట్‌మెంట్ మొదటిసారి బయటకు వచ్చింది. పిల్లల కోసం తన కుటుంబ గోప్యతను గౌరవించాలని శిల్పా సోషల్ మీడియాలో రెండు పేజీల సుదీర్ఘ ప్రకటనను షేర్‌ చేశారు. తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉన్నదని, తనపై మీడియా విచారణను నిలిపివేయాలని ఆమె కోరారు. శిల్పా ఈ ప్రకటన తర్వాత బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సమయంలో సోదరి షమితా శెట్టి అక్కకు మద్దతుగా మరోసారి నిలిచింది. ‘ఐ లవ్‌ యు. ప్రతి మంచి, చెడు సమయంలో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను’ సోషల్ మీడియాలో రాసింది. మరో నటుడు ఆర్‌ మాధవన్ కూడా శిల్పాకు మద్దతుగా నిలిచి.. ‘నాకు తెలిసిన బలమైన వ్యక్తులలో మీరు ఒకరు. మీరు ఈ సవాలును గౌరవంగా అధిగమిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని రాశారు.

- Advertisement -

షమిత శెట్టి, మాధవన్ కాకుండా.. వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దియా మీర్జా, ఫరా ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, హన్సల్ మెహతా, రిచా చద్దా సహా అనేక మంది ప్రముఖులు శిల్పాకు మద్దతు ఇచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?

రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర

దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం

వుహాన్‌లో మళ్లీ కరోనా కలకలం

పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్‌లో జోరుగా సెర్చింగ్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana