Todya History: ప్రపంచంలో తొలి మూత్రపిండం మార్పిడి జరిగి ఇవాల్టికి 67 ఏండ్లు పూర్తయ్యాయి. బోస్టన్లోని పీటర్ బెంట్ దవాఖానలో 1954 లో సరిగ్గా ఇదే రోజున డాక్టర్ జోసెఫ్ ముర్రే విజయవంతంగా మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఈ శస్త్రచికిత్స అనంతరం రోగి దాదాపు 8 ఏండ్లు జీవించి ఉన్నాడు. రోగి కవల సోదరుడు మూత్రపిండం ఇవ్వగా.. మార్పిడి సర్జరీని డాక్టర్ ముర్రే నిర్వహించి భవిష్యత్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేశారు. ఈ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రేకు 1990 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
అవయవ మార్పిడి ఆలోచన కొత్తదేమీ కాదు. 1950 వ దశకానికి ముందు కూడా అవయవ మార్పిడికి సంబంధించి శాస్త్రవేత్తలు అనేక విజయాలు సాధించారు. కానీ, అంతర్గత అవయవ మార్పిడి జరుగలేదు. మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటున్నందున మూత్రపిండం మార్పిడికి అనుకూలమైనదిగా శాస్త్రవేత్తలు పరిగణించారు. ఒక కిడ్నీ తీసివేసినప్పటికీ వ్యక్తి జీవించగలడు. 1900 తర్వాత చాలా సార్లు కిడ్నీ మార్పిడికి ప్రయత్నించారు. కానీ విజయం సాధించలేదు.
1954 డిసెంబర్ 23 న కిడ్నీ మార్పిడిలో పెద్ద పురోగతిని సాధించారు. రిచర్డ్ హారిక్ అనే యువకుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. బోస్టన్లోని వైద్యులను సంప్రదించాడు. చివరకు హారిక్కు ఆయన కవల సోదరుడు రోనాల్డ్ కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. దాదాపు 5 గంటలపాటు డాక్టర్ జోసెఫ్ ముర్రే బృందం కిడ్నీ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ శస్త్రచికిత్స ప్రస్తుతం అత్యంత ఆధునిక సర్జరీలకు బీజం వేసింది. ఈ సర్జరీ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రేకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహూకరించారు.
ఇవాళ జాతీయ రైతు దినోత్సవం
2013 : ఏకే-47 తుపాకీ తయారీదారు మిఖాయిల్ కలాష్నికోవ్ మరణం
2010: కేరళ మాజీ ముఖ్యమంత్రి కే కరుణాకరన్ మరణం
2008: సత్యం సాఫ్ట్వేర్ కంపెనీపై నిషేధం విధించిన ప్రపంచ బ్యాంకు
2004: భారత పదో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మరణం
2000: నటి, గాయని నూర్ జహాన్ మరణం
1968: భారత మొదటి వాతావరణ రాకెట్ ‘మేనకా’ ప్రయోగం విజయవంతం
1922: రోజువారీ వార్తలను ప్రసారం చేయడం ప్రారంభించిన బీబీసీ రేడియో
1899: ప్రముఖ నవలా రచయిత, పాత్రికేయుడు రామవృక్ష బేనిపురి జననం
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..