Road Accident | రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన కొత్తగూడెం విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద చోటుచేసుకుంది.
చుంచుపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ( Software Employee) మృతి చెందిన సంఘటన కొత్తగూడెం ( Kothagudem ) విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గురువారం రాత్రి పనినిమిత్తం కొత్తగూడెం వచ్చి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

