Earthquake | మయన్మార్‌ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది.
భూ ప్రకంపనల ధాటికి చతుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కూలిపోయింది. ఇందులో దాదాపు 40 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలిసింది. అంతేకాదు భూకంపం తర్వాత అనేక భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ప్రకటించారు.
భూ ప్రకంపనలతో బ్యాంకాక్‌లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దీంతో ఎక్కడిక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది మంది ప్రజలు నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. భూకంపం ధాటికి బ్యాంకాక్ తీరాలు అల్లకల్లోలంగా మారాయి. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ లేవని అధికారులు తెలిపారు.
ผลจาก #แผ่นดินไหว ทำให้ตึกที่จตุจักรถล่ม
Cr.คนสู้ชีวิต อดีตไม่สวยหลอกนะ pic.twitter.com/YtvA8gkV0a
— 🎀🐰🕊 (@TifFaNy_9member) March 28, 2025
Also Read..
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు | Watch Video
PM Modi | థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు
Earthquake | భారత్‌లోనూ భూ ప్రకంపనలు.. ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపం