Earthquake | మయన్మార్ (Myanmar)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్ మయన్మార్ (Myanmar)లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.
ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. పలుచోట్లు ఎత్తైన అంతస్తులు నేలకూలినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్‌లోని మండలేలో గల ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది.ఇరావడీ నది (Irrawaddy River)లోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Another aftermath video from Mandalay after it was hit by powerful 7.7 earthquake#earthquake #Myanmar pic.twitter.com/MUgIwctxm6
— Masood (@Masood9876) March 28, 2025
మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కూడా భూమి కంపించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాకుండా చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టరు స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది.
భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే, అందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
High-rise building collapses due to strong #earthquake in Chatuchak, Bangkok. #แผ่นดินไหว #กรุงเทพมหานคร pic.twitter.com/fiRV6ZIZq2
— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025
Bangkok earthquake right now #bangkok #earthquake #bkknews #bkk #แผ่นดินไหว pic.twitter.com/iKGUnc7Exd
— Sebastian Wolff (@sebastianwolffX) March 28, 2025
Massive Earthquake in South East Asia, 7.7 on the richter scale.
Scary Visuals from Bangkok received from friends. 😲
Prayers for everyone! #Earthquake pic.twitter.com/R8Wu99M4mQ
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) March 28, 2025
3 min earthquake emptying olympic sized pools on 30 of their water made it rain Pray for #Myanmar 7.7 from Myanmar #earthquake Pray #MyanmarEarthquake wow I felt it! #Bangkok pic.twitter.com/WKAjYX04CW
— Michael D. Butler (@MichaelButlerSr) March 28, 2025
Also Read..
PM Modi | థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు
King Charles | క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆసుపత్రిలో చేరిన కింగ్ చార్లెస్