Earthquake | జపాన్ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం (Japan Meteorological Agency) వెల్లడించింది.
భారీ భూప్రకంపనల ధాటికి జపాన్ రాధాని టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం సునామీ (tsunami ) హెచ్చరికలు జారీ చేసింది. 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది.
మరోవైపు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు బిల్డింగులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జపాన్ వాసులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
First pictures emerge of damaged houses after 7.4 magnitude earthquake hits #Japan. pic.twitter.com/vcawWORD0D
— Hollow dreams (@ChrisKolen001) January 1, 2024
VIDEO | Damage following 7.6 magnitude earthquake that struck western Japan#japan #earthquake #tsunami
— Crime With Bobby (@crimewithbobby) January 1, 2024
It’s a powerful shaking from local shinkansen station …
Waves are threatening 🙀#japan #earthquake#tsunami pic.twitter.com/yMEtGn24ks— 亗Kɪɴɢ Kᴏнʟɪ❶❽ ᵀᴹ (@vikasnakka11) January 1, 2024
Store Owner records his store shake after 7.4 m earthquake hit Japan
Tsunami warning is in Effect#Japan #tsunami #warning #deprem #sismo #地震 #earthquake #japanese #japannews pic.twitter.com/KJxlv0j1ii
— Hollow dreams (@ChrisKolen001) January 1, 2024
Also Read..
Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్
Coronavirus | 636 కొత్త కేసులు.. మూడు మరణాలు
Dalit woman | దళిత మహిళపై పోలీసు దాష్టీకం.. కర్రతో చితకబాది