Arvind Kejriwal | ప్రజా క్షేమమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని అన్నారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal). తమ పనితీరుతో ఆప్‌కు ప్రజాధారణ లభించిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా శ్రేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని (Be ready to go to jail) కార్యకర్తలకు పిలుపునిచ్చారు (AAP workers).
పిల్లలకు ఉన్నతమైన చదువులు, పేదలకు ఉచితంగా వైద్యం గురించి మాట్లాడితే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. అందుకు మనం సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేతలను చూసి గర్వంగా ఉందన్నారు. జైల్లో ఉన్న ఐదుగురు నాయకులు హీరోలే అని ఈ సందర్భంగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Also Read..
Srinagar | చలిగుప్పిట్లో అందాల శ్రీనగర్.. భారీగా పతనమైన ఉష్ణోగ్రతలు
Coronavirus | 636 కొత్త కేసులు.. మూడు మరణాలు
Tirumala | కొత్త ఏడాదిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు