ఆదివారం 17 జనవరి 2021
International - Nov 29, 2020 , 18:21:29

దక్షిణ ఆఫ్రికా బీచ్‌లో వింత జీవి...

 దక్షిణ ఆఫ్రికా బీచ్‌లో వింత జీవి...

జోహన్నెస్‌బర్గ్: దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్ బీచ్‌లో ఓ వింత జీవి కనిపించింది. కొన్నినీలం రంగు సముద్రపు జంతువులు కొన్ని వడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇవి చూడటానికి డ్రాగన్స్‌లా ఉన్నాయి. అయితే ఈ జంతువులను అక్కడి స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ జంతువు ఫొటో సామాజిక  మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనికి కొందరు ఇదేం జంతువు అంటే, కొందరు మాత్రం దాన్ని తిరిగి నీళ్లల్లో పెట్టండి... అన్నారు. మరికొందరు అది చాలా అందంగా ఉందంటూ జంతు ప్రేమని చాటుతున్నారు. ఈ జంతువు పక్షి రెక్కలతో భలే వింత గా ఉందని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.