ShahRukh Khan | అందుకే సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నా : షారుక్ ఖాన్
ShahRukh Khan | గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (ShahRukh Khan).. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL 2024) ఎంజాయ్ చేస్తున్నారు.
ShahRukh Khan | గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (ShahRukh Khan).. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL 2024) ఎంజాయ్ చేస్తున్నారు. తన సొంత జట్టైన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు మద్దతుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. మరోవైపు అభిమానులు మాత్రం షారుక్ తదుపరి ప్రాజెక్ట్ (next project)పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాలనుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు షారుక్ తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాద్ షా వెల్లడించారు.
‘మూడు సినిమాలతో గతేడాది మొత్తం బిజీగా గడిపాను. శరీరాన్ని చాలా కష్టపెట్టా. అందుకే ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణించుకున్నా. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతానని జట్టుకు మాటిచ్చాను. అందుకే నా తర్వాతి సినిమా షూటింగ్ జూన్, ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. అన్ని మ్యాచ్‌లకూ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని షారుక్ చెప్పుకొచ్చాడు.
షారుక్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఓ అగ్ర హీరో కేవలం ఏడాది వ్యవధిలో మూడు భారీ విజయాలను సొంతం చేసుకోవడం అరుదైన విషమయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన గతేడాది విజయాన్ని ఆస్వాదిస్తూ.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి సినిమాల గురించి మాత్ర ఇప్పటివరకు ఎలాంటి వివరాలు అందించలేదు. దాంతో అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు.
Also Read..
Double iSmart | ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్.. ట్రెండింగ్‌లో విజువల్స్
Trisha Birthday | త్రిష కు బర్త్ డే విషెస్ తెలిపిన ‘విశ్వంభర’ టీమ్
Vijay Devarakonda | కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. దర్శకుడు ఎవరంటే.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

