Devaki Nandana Vasudeva | అశోక్ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరో (Hero) సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు.
Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరో (Hero) సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తున్నాడు. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
నేడు అశోక్గల్లా పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే (Yemayyinde) అనే రోమాంటిక్ మెలోడిని చిత్రయూనిట్ విడుదల చేసింది. ”ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు.. నీ వల్లే కాదని అనకు.. ఏమయ్యిందో తెలిసే వరకు’ అంటూ సాగిన ఈ ప్రేమ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించాడు. ఈశ్వర్ దత్ పాడాడు. ఇక త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
ఈ మూవీని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల చివరగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్ జంధ్యాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

