Prajwal Revanna: ప్రజ్వల్ కోసం రెండో లుకౌట్ నోటీసు.. రేవణ్ణ ఇంటికి విచారణ బృందం
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఇవాళ రెండో లుకౌట్ నోటీసు జారీ చేశారు. అతని కోసం విచారణ అధికారులు ఇవాళ అతని ఇంటికి వెళ్లారు. లైంగిక వేధింపుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే.
బెంగుళూరు: సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కోసం ఇవాళ రెండో లుకౌట్ నోటీసు జారీ చేశారు. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణకు కోసం లుకౌట్ నోటీసు ఇచ్చినట్లు కర్నాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. హసన్ ఎంపీ ప్రజ్వల్, హోలెనరసిపుర్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై నమోదు అయిన లైంగిక వేధింపుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నది. శుక్రవారం మరో మహిళ కూడా ఫిర్యాదు చేయడంతో .. ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 376 కింద రేప్ కేసును బుక్ చేశారు.
మరో వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కర్నాటక సీఎం సిద్దరామయ్యకు ఇవాళ లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసులోని బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో ఆయన కోరారు. హేయమైన చర్యలకు పాల్పడిన వ్యక్తలను శిక్షించాలని రాహుల్ తన లేఖలో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

