Donald Trump | అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం (Tariffs) ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సుంకాల విధింపుకు ఆగస్టు 1 వరకూ అమెరికా డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. డెడ్‌లైన్‌కు ముందే యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌పై విధించే సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖల్యు చేశారు. వాయిదా గడువు ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకుంటే గరిష్ఠంగా 25 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
స్కాట్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి వస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారైందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. లేదని ట్రంప్ సమాధానమిచ్చారు. ‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. 20 నుంచి 25 శాతం సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నాం. భారత్ మాకు మంచి మిత్ర దేశం. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మాపై భారీగా సుంకాలు విధించింది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read..
Apple: చైనాలో యాపిల్ స్టోర్ మూసివేత..
Tsunami Warning | సునామీ హెచ్చరికలు.. ఏ దేశాలకు ఎంత ముప్పు ఉందంటే..
Justin Trudeau | మళ్లీ ప్రేమలో పడ్డ కెనడా మాజీ ప్రధాని.. అమెరికన్ సింగర్‌తో చెట్టాపట్టాలు