Tsunami Warning | రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కంచాట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్లో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు ఇప్పటికే రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది.
3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాలు
ఈక్వెడార్, రష్యా, వాయవ్య హవాయి దీవులు
1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాలు
చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటీ, మిడ్ వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు
0.3 నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే ప్రాంతాలు
అంటార్కిటా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేసియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగిని, ఫిలిప్పీన్స్, తైవాన్
0.3 మీటర్లలోపు అలలు వచ్చే ప్రాంతాలు
బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం
Tsunami2