Justin Trudeau | కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీ (Katy Perry)తో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ (dinner date)కు వెళ్లిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తన న్యూ ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా కేటీ పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రూడోతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లారు. మాంట్రియల్‌లోని హై ఎండ్ ఫ్రెంచ్ బిస్ట్రోలో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. ఇద్దరూ రహస్యంగా విందుకు వెళ్లినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కేటీ పెర్రీ, ట్రూడో కూర్చొని రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు. ఆ సమయంలో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది.
🤮Katy Perry and former Canadian Prime Minister Justin Trudeau spotted on a dinner date in Montreal. pic.twitter.com/k5PXieqD2u
— Truthseeker (@Xx17965797N) July 29, 2025
జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీ (Sophie Gregoire)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు. మరోవైపు జనవరి 2025లో ప్రధానమంత్రి పదవికి ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
Also Read..
Tsunami warning | సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి.. అమెరికా ప్రజలకు అధ్యక్షుడు ట్రంప్ సూచన
Tsunami warnings: మరికొన్ని గంటల్లో హవాయి తీరానికి సునామీ.. బీచ్‌ల నుంచి వెళ్లిపోతున్న జనం