Tsunami warning | రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం (Earthquake)తో.. పసిఫిక్ తీరాల్లో సునామీ హెచ్చరికలు (Tsunami warnings) జారీ చేశారు. జపాన్‌తో పాటు అమెరికాలోనూ (America) హెచ్చరికలు ఇచ్చారు. దీంతో హవాయి (Hawaii) ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Due to a massive earthquake that occurred in the Pacific Ocean, a Tsunami Warning is in effect for those living in Hawaii. A Tsunami Watch is in effect for Alaska and the Pacific Coast of the United States. Japan is also in the way. Please visit https://t.co/wdFzeu1I0h for the…
— Donald J. Trump (@realDonaldTrump) July 30, 2025
Also Read..
Tsunami warnings: మరికొన్ని గంటల్లో హవాయి తీరానికి సునామీ.. బీచ్‌ల నుంచి వెళ్లిపోతున్న జనం
Strongest Earthquake: అత్యంత శక్తివంతమైన భూకంపం.. చరిత్రలో ఆరోసారి రికార్డు
Russia Earthquake | రష్యాను కుదిపేసిన భూకంపం.. సునామీ వీడియోలు వైరల్!