Russia Earthquake | రష్యాను భారీ భూకంపం వణికించింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్ను సునామీ తాకింది.
భూకంపం నేపథ్యంలోని కంచట్కా, పెట్రోపావ్లోవ్స్క్ నగరాల్లోని పలు భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది. విద్యుత్, సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని చెప్పింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన స్థానికులు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. కాగా, ఈ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
🚨🚨 BREAKING NEWS 🚨🚨
USGS has upgraded the earthquake to a massive 8.7 magnitude!
The powerful quake struck off the eastern coast of Russia.
There is a serious tsunami threat.
Japan, Hawaii, and Alaska are on high alert.Story still developing…#earthquake #tsunami pic.twitter.com/RCCBgYiGER
— Manni (@ThadhaniManish_) July 30, 2025
మరోవైపు రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని భారత కాన్సులెట్ జనరల్ తెలిపింది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికాలోని భారత పౌరులకు భారత కాన్సులేట్ జనరల్ సూచించింది. ఎమర్జెన్సీ సిట్యూయేషన్స్కు సిద్ధంగా ఉండాలని.. మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు చార్జింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కోరింది.
Breaking – 8.7 Magnitude Earthquake off Russia’s Kamchatka Peninsula.
Tsunami warning for Hawaii and watches along the West Coast of United States.#earthquake #russia
— Kevin W. (@Brink_Thinker) July 30, 2025
🌊
The closer you are to the EQ, the smaller the waves 🌊This is wild.
This could be all that it is.
Footage of the 10-15 FOOT waves of the tsunami hitting the coast of Severo-Kurilsk Russia.#earthquake #Tsunami #TsunamiWatch pic.twitter.com/gQDOjHDf6w
— Kiran Joshi ( Follow Back 100%) Live #Ukraine (@Kiranjoshi900) July 30, 2025
🚨 BREAKING: Tsunami waves triggered by a massive 8.7 magnitude earthquake are slamming into Russia, sweeping away buildings.
Waves are now racing across the Pacific — expected to reach Hawaii within hours.#earthquake #tsunami#Tsunamiwarning #TsunamiWatch pic.twitter.com/gAzNdDrzS4
— Rebel_Warriors (@Rebel_Warriors) July 30, 2025
pic.twitter.com/ohhhpg5VAP JUST IN: Japan right now —as the tsunami begins . #hawaii #tsunami #TsunamiWatch #earthquake .
— Ape𝕏 (@CubanOnlyTrump) July 30, 2025