Earthquake | దాయాది పాకిస్థాన్ (Pakistan), చైనా (China) దేశాలను భూకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాక్‌లో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 240 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. పాక్‌లో ఇటీవలే వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు చైనాలోనూ భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.7గా నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది. 220 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. తాలిబన్ల ఆధీనంలోని అఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
అయితే, ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా, అఫ్ఘాన్‌లో భూకంపం సంభవించడం మూడు రోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 3వ తేదీన 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 20 మందికిపైగా మృతి చెందగా, 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దాన్నుంచి కోలుకోకముందే మరోసారి ప్రకంపనలు రావడంతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
US Shutdown | షట్‌డౌన్ ఎఫెక్ట్‌తో అమెరికా కీలక నిర్ణయం.. విమాన సేవల్లో 10 శాతం కోత
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ కాల్మేగీ బీభత్సం.. 114 మంది మృతి, 127 మంది మిస్సింగ్