US Shutdown | అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ (US Shutdown) నేటితో 38వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ షట్‌డౌన్ దేశంలోని పలు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. షట్‌డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
విమాన సేవల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. రద్దీ అత్యధికంగా ఉన్న 40 విమానాశ్రయాల్లో (40 airports in the US) 10 శాతం విమానాలను రద్దు (cut flight capacity) చేయనుంది. ఈ మేరకు ఆ దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటించారు. ఈ మార్పులు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారితే అదనపు ఆంక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు (funding bill) ఆమోదం దక్కకపోవడంతో అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షట్‌డౌన్ నేటితో 38వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్‌డౌన్‌తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆహార సహాయంతోపాటు సామాన్య ప్రజల నిత్య జీవితంలోని కీలక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు కోతపడగా విమాన ప్రయాణాలలో ఆలస్యాలు, జీతం లేకుండా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండడంతో ప్రజల జీవితాలపై ఈ షట్‌డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
ఇప్పటికీ ఇది ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ షట్‌డౌన్ కారణంగా అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 7 బిలియన్ డాలర్లకుపైనే (రూ. 62,195 కోట్లు) నష్టం వాటిల్లింది. షట్‌డౌన్ ఎత్తివేసి పూర్వ పరిస్థితులు ఏర్పడినా అది తిరిగి పొందలేని నష్టమని నిష్పక్షపాతంగా పనిచేసే కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) కొత్త నివేదిక తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలానికి మరింత నష్టం ఏర్పడుతుందని పేర్కొంది.
Also Read..
అమెరికా చరిత్రలో సుదీర్ఘ షట్‌డౌన్
షట్‌డౌన్ ఎఫెక్ట్.. ఆలస్యంగా విమాన రాకపోకలు
US shutdown | షట్‌డౌన్‌తో సిబ్బంది కొరత.. అమెరికాలో స్తంభించిన విమాన సేవలు