Tariff | ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడికి దిగిన విషయం తెలిసిందే. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. గరిష్ఠంగా 49 (అత్యధికంగా కంబోడియా) శాతం వరకు పన్నులు విధించారు. భారత్‌పై 26 శాతం, చైనా (China)పై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన టారిఫ్‌లపై చైనా స్పందించింది. ఈ మేరకు ప్రతీకార సుంకాలు ప్రకటించింది.
అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై (US goods) 34 శాతం అదనపు సుంకం విధించనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. అన్ని దేశాలకూ వేసే 10 శాతం సుంకం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని.. అయితే, అమెరికాకు మాత్రమే విధించే 24% టారిఫ్‌లు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
అయితే, చైనా ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. టారిఫ్‌ల విషయంలో చైనా అతిగా స్పందిస్తోందని వ్యాఖ్యానించారు. ‘చైనా తప్పు చేసింది. వారు భయపడ్డారు. దీన్ని చైనా అమలు చేయలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
Also Read..
iPhone | ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. మరింత పెరగనున్న ఐఫోన్ ధరలు..?
Tariffs | టారిఫ్‌ల నుంచి రష్యా, ఉత్తర కొరియా దేశాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్.. ఎందుకంటే..?
Donald Trump | ట్రంప్ టారీఫ్‌ల మోత.. భారత్‌పై ఎంతంటే?