Tariffs | టారిఫ్‌ల నుంచి రష్యా, ఉత్తర కొరియా దేశాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్.. ఎందుకంటే..?
Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పినట్లుగానే చేశారు. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను (Tariffs) ప్రకటించారు. అయితే, ఆయన పరస్పర సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలకు మినహాయింపు లభించింది.
Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పినట్లుగానే చేశారు. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను (Tariffs) ప్రకటించారు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్‌ను విధించారు. అత్యధికంగా కంబోడియా దిగుమతులపై 49 శాతం, భారత్‌పై 26 శాతం టారిఫ్‌ను వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన పరస్పర సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలకు మినహాయింపు లభించింది.
అందులో రష్యా (Russia)తోపాటు ఉత్తర కొరియా (North Korea), బెలారస్, క్యూబా సహా పలు దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాలు వర్తించవని వైట్‌హౌస్ వెల్లడించింది. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ఉన్న ఇరాన్, సిరియా దేశాలు మాత్రం సుంకాల దెబ్బను ఎదుర్కోక తప్పలేదు. ఆయా దేశాలపై 10, 40 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా అధ్యక్షుడు ప్రకటించారు.
కాగా, గురువారం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు దేశాలపై ట్రంప్ టారీఫ్‌ల మోత మోగించారు. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని అధ్యక్షుడు తెలిపారు. అయితే, కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. చైనాపై 34 శాతం, ఈయూపై 20 శాతం సుంకాలు విధించినట్లు తెలిపారు. కెనడా (Canada), మెక్సికో దిగుమతుల పైనా సుంకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఈక్రమంలోనే ఆయన తాజా ప్రకటనలో ఈ దేశాల ప్రస్తావన తేలేదు.
Also Read..
Tariffs | ట్రంప్ 26 శాతం సుంకాలు.. భారత్ స్పందన ఇదే
Trump Tariffs | సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే..?
Donald Trump | ట్రంప్ టారీఫ్‌ల మోత.. భారత్‌పై ఎంతంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

