Thailand | థాయ్‌లాండ్ (Thailand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది (school bus catches fire) . ఈ దుర్ఘటనలో సుమారు 25 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
థాయ్‌లాండ్ నేషన్ ప్రకారం.. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ కోసం ఉథాయ్ థాని ప్రావిన్స్‌కు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 44 మంది ఉన్నట్లు సదరు మీడియా నివేదించింది.
ఈ ఘటనలో 25 మంది వరకూ ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్‌లో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్కిట్ తెలిపారు. మరోవైపు ప్రమాద ఘటనపై థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా స్పందించారు. మృతులకు సంతాపం తెలిపారు.
More shocking video Thailand School bus Fire #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/XUtC7fiWdM
— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024
Also Read..
Lamborghini | లాంబోర్గిని కారును ఆపిన ట్రాఫిక్ పోలీసు.. తర్వాత ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్
GOAT Movie | ఓటీటీలోకి విజయ్ ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Dera Baba | హర్యానా ఎన్నికల వేళ.. డేరా బాబాకు మరోసారి పెరోల్