GOAT Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘గోట్'(Goat Movie) (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) . వెంకట్‌ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది (GOAT OTT release).
అక్టోబర్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టర్ విడుదల చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటనున్నట్లు వెల్లడించింది.
Ever seen a lion become a G.O.A.T?! 👀💥
Thalapathy Vijay’s The G.O.A.T- The Greatest Of All Time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi 🐐🔥#TheGOATOnNetflix pic.twitter.com/5mwZ2xdoSo
— Netflix India South (@Netflix_INSouth) October 1, 2024
ఈ చిత్రంలో దళపతి విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. త్రిష అతిథి పాత్రలో కనిపించారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇదే విజయ్ లాస్ట్ మూవీ అని ప్రచారం జరగుతోంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే..
గాంధీ (విజయ్) నిజాయితీ పరుడు. ఇండియా తరఫున స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్‌లో అతనో రహస్య ఉద్యోగి. ఓ మిషన్‌పై కెన్యాలో తన మిత్రుడితో కలిసి చేసిన ఓ ఆపరేషన్‌లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్(మైక్ మోహన్)ని అనుకోకుండా చంపేస్తాడు. ఆ తర్వాత మరో మిషన్ మీద తన భార్య అను(స్నేహ), తన కుమారుడు జీవన్‌తో కలిసి మరో దేశానికి వెళ్తాడు. అక్కడ ఊహించని పరిణామాలు గాంధీకి ఎదురువుతాయ్. కొన్ని పరిస్థితుల కారణంగా గాంధీకి కొడుకు జీవన్ దూరమవుతాడు. దూరమైన జీవన్ ఏమయ్యాడు? ఎలా పెరిగాడు? తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
Also Read..
Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
Rajinikanth | నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి.. రజనీకాంత్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్