Govinda | బాలీవుడ్ నటుడు, శివసేన లీడర్ గోవిందా (Govinda) ఇంట్లో గన్ మిస్ఫైర్ (gun misfire) అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నటుడిని హుటాహుటిన ముంబై (Mumbai)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవిందా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ను తనిఖీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా మిస్ఫైర్ అయ్యింది. అందులోని బుల్లెట్ గోవిందా కాలులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నటుడు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Illegal Land Allotment: ముడా స్కామ్లో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, 326 మంది అధికారుల పేర్లు