Bengal doctors | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (Bengal doctors) మరోసారి నిరసనబాట పట్టారు. విధులను పూర్తిగా పక్కనబెట్టి ఆందోళనకు దిగారు. వైద్యులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై గత రెండు నెలలుగా అక్కడి వైద్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమ డిమాండ్లను నెరవేర్చుతామని మమతా బెనర్జీ సర్కార్ అంగీకరించిన నేపథ్యంలో 42 రోజుల నిరసన తర్వాత జూనియర్ డాక్టర్లు సెప్టెంబర్ 21న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరయ్యారు. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో విధులకు మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా మరోసారి వారు పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.
భద్రత కోసం తమ డిమాండ్లను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిరసన చేపట్టి నేటికి 52 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ తమపై దాడులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అనంతరం తమ భద్రత సహా ఇతర హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని ఆగ్రహించారు. ప్రస్తుతం విధులను బహిష్కరించడం మినహా తమకు వేరే మార్గం లేదని పేర్కొన్నారు.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Young Team of Fab- 4 | దూకుడే మంత్రగా దూసుకొస్తున్న కుర్రాళ్లు.. నయా ఫ్యాబ్- 4 అవుతారా..?
Assembly Elections | జమ్ముకశ్మీర్లో చివరి విడత ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్