Young Team of Fab- 4 : ‘కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు ప్రభ తగ్గిపోతోంది’.. ఈ నానుడి అన్నిరంగాలతో పాటు క్రికెట్‌కు కూడా వర్తిస్తుందండోయ్.. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాల రికార్డులను బద్ధలు కొడుతూ ఫ్యాబ్- 4గా చరిత్రకెక్కిన ఆ నలుగురు మనందరికీ సుపరిచితమే. విరాట్ కోహ్లీ (Virat Kohli), జో రూట్ (Joe Root), స్టీవ్ స్మిత్ (Steve Smith), కేన్ విలియమ్సన్ (Kane Williamson). దాదాపు 10 ఏండ్ల కిందట వాళ్ల కెరీర్ ఎలా మొదలైందో.. ఇప్పుడు కోహ్లీ, రూట్, కేన్ మామ, స్మిత్‌లు ఏ స్థాయలో ఉన్నారో తెలిసిందే. అచ్చుగుద్దినట్టు ఈతరంలోనూ ఓ నలుగురి ప్రయాణం అలానే సాగుతోంది.
భవిష్యత్ తారలుగా ప్రశంసలు అందుకుంటూ సంచలన ఇన్నింగ్స్‌లతో.. పరుగుల ప్రవాహంతో.. రికార్డుల వెల్లువతో శరవేగంగా దూసుకొస్తున్నారు. నయా ఫ్యాబ్- 4గా పాగా వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంతకు వాళ్లెవరో ఊహించారా..? ఈ రెండేండ్ల కాలలో రికార్డుల పర్వం లిఖిస్తున్న ఆ నలుగురు ఇంకెవరు.. యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), కమిందు మెండిస్(Kamindu Mendis), హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర (Rachin Ravindra)లు. సంప్రదాయ షాట్లతో కోహ్లీ, రూట్, స్మిత్, విలియమ్సన్‌లు పాపులర్ అవ్వగా.. ఈ యంగ్ గన్స్ మాత్రం దూకుడే మంత్రగా హీరోలు అవుతున్నారు.
A new 𝐅𝐚𝐛 𝐅𝐨𝐮𝐫 is emerging in Test cricket 🤩
🇱🇰 Kamindu Mendis
🇮🇳 Yashasvi Jaiswal
🇳🇿 Rachin Ravindra
🏴 Harry Brook pic.twitter.com/DCCq3XIlLZ— Sport360° (@Sport360) September 28, 2024
టెస్టు క్రికెట్లో రికార్డు బ్రేకర్స్‌గా అవతరించిన దిగ్గజ ఆటగాళ్లు చాలామందే. కానీ, విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లు అందరికంటే విభిన్నం. ఆట పరంగానే కాదు టెక్నిక్, ఫుట్‌వర్క్ పరంగానూ ఈ నలుగురు చాలా స్పెషల్. వీళ్లు క్రీజులో ఉన్నారంటే కెప్టెన్‌కు భరోసా.. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ. అందుకనే 2014లో మార్టిన్ క్రొవే (Martin Crowe) అనే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్యాబులస్ -4 లేదా ఫ్యాబ్-4 అని వీళ్లకు నామకరణం చేశాడు. అప్పటి నుంచి ఈ ట్యాగ్ వీళ్లకు స్థిరపడింది. శతకాల మోతతో, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ విన్నర్లుగా పేరొందిన వీళ్లు మరో రెండు లేదా మూడు ఏండ్లలో వీడ్కోలు పలికే అవకాశముంది.
THE BIRTH OF FAB 4 ON THIS DAY 10 YEARS AGO:
Martin Crowe in 2014 said, “Smith, Kohli, Root and Kane have hunger, talent and responsibility. All four will go on to captain their countries, all four will reach peak form, they’ll have a real battle as who’ll be the No.1 batter”. pic.twitter.com/qQfVIGkqgj
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 31, 2024
ఆ తర్వాత ఫ్యాబ్ 4 ఎవరు? అనే ప్రశ్నకు సమాధానమే యశస్వీ జైస్వాల్, కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర. ఈ నలుగురు కుర్రాళ్లలో అపారమైన ప్రతిభే కాదు ఎంతటి బౌలర్‌ను అయినా ఒత్తిడిలో పడేసే తెగింపు ఉంది. అందుకు వీళ్ల రికార్డులే సాక్ష్యం. భారత ఓపెనర్ యశస్వీ నిరుడు వెస్టిండీస్ పర్యటనలో అరంగేట్రం చేసి.. 3 సెంచరీలతో రికార్డులు బద్ధలు కొట్టాడు.
Yashasvi Jaiswal all scores in Tests (latest first) 👇
72, 10, 56, 57, 37, 73, 214*, 10, 17, 209, 15, 80, 28, 0, 5, 17, 38, 57, 171
Average: 64.77 🤯 pic.twitter.com/RGyokARwI8
— Sameer Allana (@HitmanCricket) September 30, 2024
ఇక శ్రీలంక కెరటం కమిందు మెండిస్ అయితే.. 7 సెంచరీలతో చరిత్రపుటల్లో నిలిచాడు. ఈ మధ్యే ఏడు దేశాలపై శతకాలతో రికార్డు నెలకొల్పిన కమిందు.. న్యూజిలాండ్‌పై విధ్వంసక వందతో జట్టును గెలిపించాడు. అంతేకాదు..13 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేసుకొని డాన్ బ్రాడ్‌మన్ రికార్డు సమం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్ కుర్రాడు హ్యారీ బ్రూక్ సైతం టెస్టుల్లో 5సార్లు శతక గర్జనతో రికార్డు బ్రేకర్ అయ్యాడు. ఇక.. భారతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలతో మెరిసిన రచిన్ రవీంద్ర.. టెస్టుల్లోనూ తన ముద్ర వేస్తున్నాడు. ఈ నలుగురు గనుక నిలకడగా రాణిస్తే అభినవ ఫ్యాబ్-4గా అవతరించడం ఖాయం అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Scorecard when Kamindu Mendis comes to bat:
– 57-5 vs BAN, then scored 102
– 126-6 vs BAN, scored 164
– 95-4 vs ENG, scored 113
– 83-5 vs ENG, scored 74
– 93-5 vs ENG, scored 64
– 88-3 vs NZ, scored 114 😱Realizing that Kamindu is not a flat-track bully. 🇱🇰#SLvsNZ #SriLanka pic.twitter.com/wSkA1I8Ub7
— Muhammadh Nazeem 🇱🇰 (@nazee_marz) September 28, 2024