Watch: రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన.. కాన్వాయ్ పక్కగా కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది.
చండీగఢ్: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి కలకలం సృష్టించాడు. రాహుల్ గాంధీ వాహనం పక్కగా బైక్‌పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర కూడా ఉన్నది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పక్కగా బైక్ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించడంపై విమర్శలు వచ్చాయి.
మరోవైపు 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరుగనున్నది. అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
हरियाणा में राहुल गांधी के काफिले के साथ-साथ एक ताऊ लट्ठ लेकर मोटरसाइकिल से चल रहे हैं।
राहुल की जगह नरेंद्र मोदी होते तो अब तक रो देते कि बता देना जिंदा लौट आया हूं।
वीडियो – @mandeeppunia1 भाई pic.twitter.com/c1JVDOhuY3
— Krishna Kant (@kkjourno) September 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

